సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏంచేసినా అది సెన్సేషన్ అవుతుంది. అలా చాలాసార్లు కాంట్రవర్సీ లకు కేరాఫ్ గా నిలిచారు వర్మ. అలాంటి వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బయోపిక్ గా వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు వర్మ.
ఇదిలా ఉంటే.. వర్మపై అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వ్యూహం సినిమా గురించి మాట్లాడుతూ.. తన చెత్త సినిమాలతో సమాజానికి కంటకంగా మారిన వర్మ తల నరికి వస్తే కోటి రూపాయలు బహుమతిగా ప్రకటించారు శ్రీనివాసరావు. దానిపై స్పందించిన వర్మ.. పోలీసులు, కేసులు అంటూ తిరుగుతున్నారు. అంతేకాదు.. శ్రీనివాసరావు ప్రకటించిన డబ్బులకి ఆశపడి ఎవరైనా దాడిచేస్తే ఎవరు భాద్యత అంటూ కామెంట్స్ చేశారు.
తాజాగా.. ఇదే విషయంపై జనసేన నేత, పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేశార. ఆర్జీవీ చేసిన కంప్లైంటుపై నాగబాబు సెటైరికల్ పోస్ట్ చేశార.. వర్మ గారిపై చేసిన వ్యాఖ్యలను నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. అయినా ఆర్జీవీ గారు మీరేం భయపడకండి.. మీ జీవితానికి ఏ డోఖా ఉండదూ. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ లో.. ఆ మాటకొస్తే ఇండియా లో ఏ పనికి మాలిన వెదవ కూడా మీకెలాంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడు చంపడు కదా. మీరేం వర్రీ అవకండి, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. ఎల్లపుడు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి.. అంటూ రాసుకొచ్చాడు నాగబాబు. ప్రస్తుతం నాగబాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
👉 – Please join our whatsapp channel here –