DailyDose

బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు

బీభత్సం సృష్టించిన ఆర్టీసీ బస్సు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని కోయవారిపాలెంలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లోలెవల్‌ చప్టాలో బస్సు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. బస్సులోని ప్రయాణికులందరినీ క్షేమంగా బయటకు దించినట్లు చెప్పారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు వివరాలు సేకరించారు. లోలెవల్ చప్టా వద్ద కల్వర్టు నిర్మించాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. రహదారి పక్కనే ఉన్న వాగులో బస్సు పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని చెబుతున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z