DailyDose

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్

తెలంగాణలో ఇంటర్‌ వార్షిక పరీక్షల(Telangana Inter Exams) షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు అధికారులు గురువారం పూర్తి షెడ్యూల్‌ విడుదల చేశారు. రోజూ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.

మరోవైపు, ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు (జనరల్‌/వొకేషనల్‌ కోర్సులు) ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు రెండో శనివారం, ఆదివారాల్లోనూ జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రాక్టికల్‌ పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌; మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండో సెషన్‌లో జరుగుతాయని వివరించారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థులకు ఇంగ్లీష్‌ ప్రాక్టికల్‌ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహిస్తారు.

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్ష తేదీలివే..

ఫిబ్రవరి 28 – పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజి పేపర్‌-1).
మార్చి 1 – పార్ట్‌ 1 (ఇంగ్లీష్ పేపర్‌-1).
మార్చి 4 – పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్-1ఏ, బోటనీ పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1).
మార్చి 6 – మేథమేటిక్స్‌ పేపర్‌ 1బి, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1.
మార్చి 11- ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1.
మార్చి 13 – కెమెస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1.
మార్చి 15 – పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-1 (ఫర్ బైపీసీ స్టూడెంట్స్‌).
మార్చి 18 – మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, జియోగ్రఫీ పేపర్‌-1.

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్ష తేదీలివే..

ఫిబ్రవరి 29 – పార్ట్‌ 2 (సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2).
మార్చి 2 – పార్ట్‌ 1 (ఇంగ్లీష్‌ పేపర్‌-2).
మార్చి 5 – పార్ట్‌ 3 (మేథమేటిక్స్‌ పేపర్‌ 2ఏ, బోటనీ పేపర్‌ 2, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ 2).
మార్చి 7 – మేథమేటిక్స్‌ పేపర్‌ 2బి, జూవాలజీ పేపర్‌-2, హిస్టరీ పేపర్-2.
మార్చి 12 – ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌ పేపర్‌-2.
మార్చి 14 – కెమెస్ట్రీ పేపర్‌ -2, కామర్స్‌ పేపర్‌-2
మార్చి 16 – పబ్లిక్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-2, బ్రిడ్జి కోర్స్‌ మ్యాథ్స్‌ పేపర్‌-2 (ఫర్‌ బైపీసీ స్టూడెంట్స్‌).
మార్చి 19 – మోడరన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2, జియోగ్రఫీ పేపర్‌-2.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z