తిరుపతి జిల్లా నాయుడుపేట నాలుగు వీధుల కూడలిలో ఉన్న గ్రామదేవత శ్రీపోలేరమ్మ ఆలయంపై వైకాపా నాయకులు.. సీఎం చిత్రంతో ఉన్న హోర్డింగ్ పెట్టారు. గుడి విద్యుత్తునే ఆ బోర్డుకు వినియోగిస్తున్నారు. ప్రచారానికి ఇలా పవిత్ర స్థలాలనూ వదలకపోతే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అమ్మ సన్నిధిలోనూ హద్దుమీరుతున్న అధికార పార్టీ నేతలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అసలైతే.. దేవాదాయశాఖకు చెందిన గుళ్లపై పార్టీల బోర్డులే అమర్చకూడదు. దీనిపై ఈవో శశాంక్‌ను వివరణ కోరగా విషయం తెలియదని, పరిశీలించి ఆలయం విద్యుత్తు వాడకుండా చేస్తామన్నారు.
👉 – Please join our whatsapp channel here –