‘వైనాట్ 175.. వైనాట్ కుప్పం’ అంటున్న వైకాపా నాయకులకు కుప్పంలో సొంత పార్టీలోనే రెబల్స్ బెడద తలనొప్పిలా మారింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైకాపా రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ కుప్పం మండలం వసనాడు మాజీ సర్పంచి మురళి ఇప్పటికే ప్రకటించారు. తాజాగా శాంతిపురం మండలం మొరసనపల్లె వైకాపా సర్పంచి జగదీశ్ భార్య నీల తాను కూడా పోటీ చేస్తానంటూ ఇంటింటా ప్రచారం ప్రారంభించారు. నీల బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి. వైకాపా పాలనలో నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఆమె ఆరోపిస్తున్నారు. సెప్టెంబరు 13న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొరసనపల్లెకు రాగా, గ్రామస్థులతో కలిసి నీల జాతీయ రహదారిపై మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. వైకాపా నాయకుడు చేపట్టిన భూ ఆక్రమణ, అక్రమ నిర్మాణాలపై నిరసన తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –