Movies

‘వ్యూహం’ సినిమాకు మరో ఎదురుదెబ్బ

‘వ్యూహం’ సినిమాకు మరో ఎదురుదెబ్బ

దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన ‘వ్యూహం’(Vyooham) సినిమాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రం విడుదలపై హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు స్టే విధించింది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీ, యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలోనూ ఈ చిత్రం విడుదలపై కోర్టు స్టే ఆదేశాలు జారీ చేసింది. థియేటర్లలో ‘వ్యూహం’ విడుదలపై తెలంగాణ హైకోర్టు గురువారం బ్రేక్‌ వేసిన సంగతి తెలిసిందే. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠను దెబ్బతీసేలా రూపొందించిన ఈ చిత్ర ప్రదర్శనకు కేంద్ర సెన్సార్‌ బోర్డు అనుమతించడాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 28న(శుక్రవారం) విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పు వెలువరించింది. కేంద్ర సెన్సార్‌ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z