తెలుగుదేశానికి కుప్పం నియోజకవర్గం కంచుకోట అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడే కుప్పం అభివృద్ధి జరిగిందని చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన రెండో రోజు పర్యటిస్తున్నారు. కుప్పం ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం శాంతిపురం నుంచి ర్యాలీ నిర్వహించగా.. తెదేపా కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
‘‘కుప్పం ప్రాంతానికి ఏం చేశారని వైకాపా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. తెదేపా అధికారంలో ఉంటే హంద్రీనీవా ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేవాళ్లం. హంద్రీనీవాను పూర్తి చేయడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డాం. మేము 87 శాతం పనులు పూర్తి చేస్తే.. 13 శాతం పూర్తి చేయని దద్దమ్మ ప్రభుత్వమిది. వైకాపా ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనే లేదు. దోపిడీ.. గజ దొంగలు.. రాష్ట్రాన్ని దోచుకోవడానికే అధికారంలోకి వచ్చారు. వైకాపా ప్రభుత్వంలో ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులను ప్రోత్సహించేందుకు ఏ కార్యక్రమమైనా చేపట్టారా?’’ అని ప్రశ్నించారు.
👉 – Please join our whatsapp channel here –