బంగారం ప్రియులకు గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో అమీర్పేట మెట్రోస్టేషన్ ప్రాంగణంలో గోల్డ్ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని ఏటీఎం ద్వారా కొనుగోలు చేయొచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డు లేదా యూపీఐ పేమెంట్ ద్వారా బంగారు, వెండి కాయిన్లను కొనుగోలు చేయొచ్చు. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఏటీఎంలో డబ్బులు తీసుకున్న విధంగానే గోల్డ్ సిక్కా ఏటీఎంలో బంగారు, వెండి కాయిన్లు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.
ఏటీఎంలో నిర్దేశించిన విధంగా లావాదేవీ పూర్తయిన వెంటనే మనం ఎంచుకున్న బంగారం కాయిన్లు బయటికి వస్తాయి. 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారం లేదా వెండి కాయిన్లను ఎంపిక చేసుకుని నిర్దేశించిన మొత్తాన్ని డెబిట్, క్రెడిట్ లేదా యూపీఐ పేమెంట్స్ ద్వారా చెల్లించాలి. ప్రారంభించిన రోజే వినియోగదారుల నుంచి ఆశించినదానికంటే మంచి స్పందన వస్తోందని గోల్డ్ సిక్కా లిమిటెడ్ యాజమాన్యం తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –