బాలీవుడ్ (Bollywood)స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవలే టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. విష్ణువర్ధన్ డైరెక్షన్లో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ఆపరేషన్ కాక్టస్ ఆధారంగా రాబోతున్న ఈ చిత్రానికి ది బుల్ The Bull టైటిల్‌ను ఫైనల్ చేశారు. 1988లో ఓ వ్యాపారవేత్త నుంచి మాల్దీవులు అధ్యక్షుడిని కాపాడేందుకు ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ కాక్టస్ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు బీటౌన్ సర్కిల్ సమాచారం.
ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో చెన్నై చంద్రం త్రిష (Trisha) కనిపించబోతున్నట్టు ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. సల్మాన్‌ఖాన్‌కు వీరాభిమాని అని తెలిసిందే. తనకు అవకాశమొస్తే సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించాలని ఉందని చాలా సార్లు చెప్పుకొచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే త్రిష చిరకాల కోరిక నెరవేరినట్టే. 2010లో హిందీలో వచ్చిన Khatta Meetha సినిమాలో నటించింది త్రిష. ఇదే నిజమైతే త్రిషకు ఇది హిందీలో రెండో సినిమా కానుంది. మరి దీనిపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన చేస్తారనేది చూడాలి.
సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో పారా మిలటరీ ఆఫీసర్‌గా నటించనున్నాడు. కరణ్ జోహార్ నిర్మించనున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2024లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
👉 – Please join our whatsapp channel here –