తనకు ‘వెంకీ’ చిత్రమెంతో ప్రత్యేకమని దర్శకుడు ‘శ్రీను వైట్ల’ అన్నారు. రవితేజ (Ravi teja) హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం 2004లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమాలోని డైలాగులు, పాటలు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడీ కామెడీ థ్రిల్లర్ డిసెంబర్ 30న రీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల (Srinu vaitla) ప్రత్యేక వీడియో పోస్ట్ చేశారు.
‘‘నాకెంతో ఇష్టమైన ‘వెంకీ’ (Venky) రీ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. ఆ సినిమా ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వొస్తుంటుంది. దాని షూటింగంతా సరదాగా చేశాం. ఆ సినిమా అంత బాగా రావడానికి ప్రధాన కారణం రవితేజ. ఆయన నాపై నమ్మకంతో నటించేందుకు ఓకే చెప్పారు. యువత ఎదుర్కొనే సవాళ్లు.. వారి భావోద్వేగాలతో తెరకెక్కిన ‘వెంకీ’ ఎవర్‌గ్రీన్. అందులో బ్రహ్మానందం పోషించిన పాత్రకు ఎంతో ఆదరణ లభించింది. 2004లో వచ్చిన ఈ చిత్రం రీ రిలీజ్ టికెట్స్ బుకింగ్స్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది’’ అని ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
ప్రస్తుతం రవితేజ ‘ఈగల్’లో నటిస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. పూర్తి స్థాయి యాక్షన్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో రవితేజ విభిన్న కోణాల్లో కనిపించనున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z