కొమురవెల్లి మల్లికార్జునస్వామి మూలవిరాట్ (నిజరూప) దర్శనం జనవరి 1 (సోమవారం)వ తేదీ సాయంత్రం నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలూరు బాలాజీ వెల్లడించారు. శుక్రవారం ఈవో కార్యాలయంలో మాట్లాడుతూ.. వచ్చే నెల 7న స్వామి కల్యాణంతో పాటు జాతర ప్రారంభం కానుందన్నారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు ఆలయ సుందరీకరణ, గర్భగుడిలోని స్వామి, అమ్మవార్ల మూలవిరాట్ విగ్రహాలను అలంకరిస్తారని చెప్పారు. ఈ మేరకు దర్శనాన్ని బంద్ చేయనున్నట్లు తెలిపారు. ఈనెల 31 రాత్రి నుంచే దర్శనం నిలిపివేయాల్సి ఉండగా, మరుసటి రోజు సోమవారం నూతన సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున నిర్ణయాన్ని మార్చినట్లు వివరించారు. జనవరి 2 ఉదయం నుంచి అర్థమండపంలోనే ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహిస్తామని, విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.
👉 – Please join our whatsapp channel here –