Devotional

తిరుమలలో మరోసారి చిరుత కలకలం

తిరుమలలో మరోసారి చిరుత కలకలం

తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత, ఎలుగు బంటి సంచారం కలకలం రేపింది. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపిన ప్రాంతంలోనే.. ఈ నెల 13, 26 తేదీల్లో వీటి సంచారం కనిపించినట్లు అటవీశాఖ అధికారులు ట్రాప్‌ కెమెరాల ద్వారా గుర్తించారు. ఈ నేపథ్యంలో నడకమార్గంలో వచ్చే భక్తులను తితిదే హెచ్చరించింది. అప్రమత్తంగా, గుంపులు గుంపులుగా భక్తులు రావాలని సూచించింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z