కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని ఐదుగురు మంత్రుల బృందం పరిశీలించింది. శుక్రవారం మధ్యాహ్నం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొమటిరెడ్డి బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. విహంగ వీక్షణం ద్వారా ఆనకట్టను పరిశీలించారు. మంత్రులతోపాటు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ కూడా ఉన్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులకు నీటిపారుదల శాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
👉 – Please join our whatsapp channel here –