ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నగరంలో నాటకోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సామాజిక సమస్యలపై ఎక్కుపెట్టిన చైతన్యాస్త్రాలుగా ఉన్న నాటికలు, నాటకాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రదర్శనలోనూ నటీనటుల నటన ప్రేక్షకుల మనసులను హత్తుకుంటున్నాయి. నంది నాటక బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టివి, నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డితో పాటు 2011 నందమూరి తారక రామారావు రంగస్థలం పురస్కార గ్రహీత KST సాయి ఈ కార్యక్రమానికి హజరయ్యారు.
ఈ నంది నాటక బహుమతుల కార్యక్రమంలో పోసాని మురళీకృష్ణ ఇలా మాట్లాడారు. ‘ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాకు సమస్ధ చైర్మన్‌గా పదవి ఇచ్చారు. కానీ నేను మూడు నెలలు పాటు ఆయనకు కనిపించకుండా తిరుగుతూనే ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్ గారు తరువాత నన్ను పిలిపించుకుని, కలను కాపాడాల్సిన బాధ్యత నీకు అప్పగించాను దాన్ని నువ్వు నిర్వర్తించాలని చెప్పారు. దీంతో నేను నిరంతరం నా కార్యచరణ కొనసాగుతుంది. ఈ క్రమంలో నంది నాటకోత్సవానికి నిష్ణాతులైన న్యాయ నిర్ణీతలను ఎంపిక చేశాం. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 87 మంది న్యాయ నిర్ణీతల్ని ఎంపిక చేశాం. నంది నాటకాల ఎంపిక విషయంలో కులం, మతం, ప్రాంతం వంటి సిఫార్సులకు తావులేదు. ఎక్కడైనా పొరపాటు ఉంటే నా చొక్కా పట్టుకుని నిలదీయండి. అని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు పలు వ్యాఖ్యలు చేశారు.’ గుంటూరులో ఏడు రోజుల నుంచి నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి. నాటకం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. నాటకం సజీవమైనది. సినిమాల్లో కన్నా నాటకాల్లో నటించడం చాలా కష్టం. సినిమాల్లో టేకులు తీసుకోవచ్చు కానీ నాటకాల్లో అలాంటి పరిస్థితి ఉండదు. సినిమాల్లో టీవీల్లో నటించిన వారు బాగా డబ్బు సంపాదించిన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ నాటక రంగంలో డబ్బులు పోగొట్టుకున్న నటీనటులే ఎక్కువగా ఉన్నారు. నాటక రంగ కళాకారులకు డబ్బులు ముఖ్యం కాదు ప్రేక్షకులకు కొట్టే చప్పట్లే వారికి గౌరవం. నాటక రంగానికి ప్రాముఖ్యత చాలా ఉంది దానిని మనం కాపాడుకోవాలి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు’ తెలిపారు.
ప్రముఖ సంగీత నవధానం సృష్టికర్త మేగడ రామలింగ స్వామికి 2022 నందమూరి తారక రామారావు రంగస్థలం పురస్కారం దక్కింది. ఆయనకు లక్షన్నర నగదు బహుమతితో పాటు అవార్డు దక్కింది. ది యంగ్మెన్స్ హేపీ క్లబ్ అధ్యక్షులు దంటు భాస్కరరావుకు 2022 డాక్టర్ వైఎస్‌ఆర్ రంగస్థలం పురస్కారం దక్కింది. ఆయనకు అవార్డుతో పాటు రూ. 5 లక్షల నగదు బహుమతి దక్కడం విశేషం
ది యంగ్మెన్స్ హేపీ క్లబ్ గురించి తెలుసా?
చితామణి, భక్తరామదాసు, కృష్ణ లీల, లోబి, డాటర్, నాటకాలు ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాలలో ప్రదర్శనలిచ్చి ఎనలేని కీర్తిని పొందింది. ఎస్వీ రంగారావు, రేలంగి వెంకట్రావు, అంజనీదేవి, సూర్యకాంతం వంటి నటులు ది యంగ్మ్‌న్స్ క్లబ్ నుంచి వచ్చినవారే. క్లబ్ వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాకారం కూడా అందజేస్తుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు రాష్ట్రమంతటా నాటకోద్యమం జరుగుతున్న తరుణంలో ఆ సంస్కృతికోత్సవంలో భాగంగా కాకినాడ నగరంలో 1913లో పల్లె హనుమంతరావు, యరగల సత్తిరాజు యువజన ఆనంద సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘాన్ని 1916లో యంగ్మ్‌న్స్ హాపీ క్లబ్‌గా దంటూ సూర్యారావు, గండికోట జోగినాధం, మాదిరెడ్డి రామానుజల నాయుడు, ఖాశిం సాహెబ్ మార్పు చేశారు. కళాకారులు, కళాభిమానుల శ్రమదానంతో ది యంగ్మెన్స్ హాపీ క్లబ్ ప్రదర్శనశాల నిర్మాణం జరిగింది.
👉 – Please join our whatsapp channel here –