Devotional

రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయం (Sabarimala temple) రేపు తెరుచుకోనుంది. ఈ ఆలయం బుధవారం రాత్రి తాత్కాలికంగా మూతపడిన విషయం తెలిసిందే. మండల పూజ అనంతరం ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆలయం తిరిగి శనివారం తెరుచుకోనుంది.

మకరవిలక్కు ఉత్సవాల్లో భాగంగా రేపు ఆలయ ద్వారాలను తెరిచి భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నారు. అదేవిధంగా జనవరి 13న ప్రసాద శుద్ధ క్రియ (prasada shudha kriya), 14న బింబ శుద్ధ క్రియ (bimba shudha kriya) లను నిర్వహించనున్నారు. 15న మకరవిలక్కు వేడుకను (Makaravilakku festival) జరపనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వెల్లడించింది.

కాగా, రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం నవంబర్‌ 17వ తేదీ నుంచి తెరుచుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మండల- మకరవిళక్కు వేడుకలు 17వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో మండల పూజల కోసం శబరిమల ఆలయాన్ని అధికారులు తెరిచి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మండ‌ల పూజ వేళ శ‌బ‌రిమ‌ల అయ‌ప్ప స్వామి ఆల‌యానికి భారీ ఆదాయం సమకూరింద. 41 రోజుల్లో ఏకంగా 241.71 కోట్ల ఆదాయం(Sabarimala Revenue) వ‌చ్చినట్లు ట్రావ‌న్‌కోర్ దేవ‌స్థానం బోర్డు తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z