DailyDose

తెల్లవారుజాము నుంచే ఆందోళనకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు

తెల్లవారుజాము నుంచే ఆందోళనకు దిగిన పారిశుద్ధ్య కార్మికులు

డిమాండ్ల సాధన కోసం పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. విశాఖలో రాత్రి దీక్షా శిబిరం వద్ద నిద్రపోయిన కార్మికులు.. శనివారం తెల్లవారుజాము నుంచే ఆందోళనకు దిగారు. కేఆర్‌ఎం కాలనీ జీవీఎంసీ చెత్తవాహనాల యార్డ్ వద్ద నిరసన చేపట్టారు. చెత్త వాహనాలు బయటకు రాకుండా అడ్డుకున్నారు. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని నినాదాలు చేశారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

నిన్న రాత్రి ఎంవీపీ కాలనీ యార్డ్ నుంచి తెచ్చి శివాజీ పార్క్‌లో ఉంచిన చెత్త సేకరణ వాహనాలను పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z.