Business

సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ ఆఫీస్ రికార్డు

సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ ఆఫీస్ రికార్డు

పాస్‌పోర్టుల జారీలో సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిందని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారిణి (ఆర్‌పీవో) జొన్నలగడ్డ స్నేహజ తెలిపారు. దేశంలోని 37 ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో మొదటి నాలుగు స్థానాల్లో ముంబయి, బెంగళూరు, లఖ్‌నవూ, చండీగఢ్‌ కార్యాలయాలు ఉన్నట్టు ఆమె వివరించారు. 2023లో పాస్‌పోర్టు కార్యాలయం పనితీరు గురించి ఆర్‌పీవో మీడియాకు వివరించారు.

పాస్‌పోర్టుల కోసం దళారీలను సంప్రదించొద్దని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తులకు అవకాశం లేకుండా పాస్‌పోర్టుల జారీ కోసం సరళీకరణ విధానాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7,85,485 పాస్‌పోర్టులు జారీ చేసినట్లు ఆమె వివరించారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది 1,42,328 పాస్‌పోర్టులు అధికంగా జారీ చేసినట్టు తెలిపారు. మిడిల్‌మెన్‌ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆధార్‌ ఆధారంగా పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకోవడం జరగదని స్పష్టం చేశారు. తత్కాల్‌ దరఖాస్తులకు స్లాట్‌ అపాయింట్‌మెంట్‌కు 4 నుంచి 5 రోజులు, సాధారణ దరఖాస్తులకు 22 రోజులు పడుతున్నట్లు ఆమె వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z