🐐 మేషం
ప్రారంభించబోయే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. తోటివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనః పీడ ఉంది. మానసిక ప్రశాంతత కోసం శివ నామాన్ని జపించడం ఉత్తమం.
🐂 వృషభం
శుభకాలం. అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇష్టదైవారాధన చేస్తే మంచిది.
💑 మిధునం
పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. ఒక వార్త మీ మనఃశ్శాంతిని తగ్గిస్తుంది. శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.
🦀 కర్కాటకం
ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శివనామాన్ని జపించాలి.
🦁 సింహం
ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీవారి సందర్శనం శుభప్రదం.
💃 కన్య
ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మంచి సమయం. ప్రారంభించిన పనులను బుద్ధిబలంతో చక్కగా పూర్తిచేయగలుగుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
⚖ తుల
లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరం అవుతాయి. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం ఉంటుంది. సొంతనిర్ణయాలు పనిచేస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. దుర్గాధ్యానం శుభప్రదం.
🦂 వృశ్చికం
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ప్రశాంత చిత్తంతో ముందుకుసాగితే అన్నీ సర్దుకుంటాయి. సూర్యారాధన శుభప్రదం.
🏹 ధనుస్సు
ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. కీలక విషయాలను కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకుంటే మంచిది. కలహసూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది.
🐊 మకరం
మీ మీ రంగాల్లో ఆశించిన ఫలితాలను రాబడతారు. అదృష్టం వరిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకర క్షణాలను గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.
🏺 కుంభం
శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కలహాలు సూచితం. తోటివారిని కలుపుకొనిపోవడం ఉత్తమం. గణేశ అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి.
🦈 మీనం
ప్రారంభించిన పనులలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది.
👉 – Please join our whatsapp channel here –