రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మూడేళ్లకే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటం అత్యంత బాధాకరమని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అభిప్రాయపడ్డారు. మేడిగడ్డ ఘటనకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించేందుకు బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రాజెక్టులో జరిగిన నష్టానికి కట్టిన వారే బాధ్యత వహించాలి. మేడిగడ్డ బ్యారేజీ అక్టోబర్ 21న కుంగితే.. డిసెంబర్ 3న ప్రభుత్వం మారేవరకు అప్పటి సీఎం కేసీఆర్ దానిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మేడిగడ్డ కుంగటం వల్ల ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఆయకట్టు మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి పరిస్థితిని అంచనా వేయనున్నాం. తక్కువ నష్టం జరిగి ఉండాలనే మేమూ కోరుకుంటున్నాం’’ అని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –