ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లిన మాండవీయ సీఎం జగన్మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రిని సీఎం శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ప్రతిమను బహుకరించారు.
👉 – Please join our whatsapp channel here –