Politics

జనసేనతో భాజపా పొత్తు కొనసాగుతుందా?

జనసేనతో భాజపా పొత్తు కొనసాగుతుందా?

జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) స్పష్టం చేశారు. కాకినాడలో శుక్రవారం ఆమె పర్యటించారు. రామారావుపేటలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘తెదేపాతో పొత్తు విషయం మా అధినాయకత్వం చూసుకుంటుంది. నాణ్యత లేని మద్యం, ఇసుక అక్రమాలపై భాజపా పోరాటం కొనసాగుతుంది. తితిదే నిధులు ధార్మిక కార్యక్రమాలకే ఉపయోగించాలి. ప్రజల కోసం ఎవరు మాట్లాడినా జగన్ అణచివేతకు గురి చేస్తారు. పరదాల చాటున తిరిగే ఈ సీఎం మనకు అవసరమా? ప్రజలు ఒకసారి ఆలోచించాలి’’ అని కోరారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z