Politics

డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ

డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ

తెదేపా మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి భద్రత కల్పించాలంటూ డీజీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఈ నెల 29న బీటెక్‌ రవికి గన్‌మెన్లను తొలగిస్తూ పోలీసుశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు తొలగించిన భద్రతను పునరుద్ధరించాలని కోరారు. 2006 నుంచి ఆయనకు భద్రత ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి కాన్వాయ్‌పై కొందరు దాడి చేసినట్లు చెప్పారు. ఆయనకు ప్రాణ హాని, ఆస్తి నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అచ్చెన్న లేఖలో పేర్కొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z