అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు. దరఖాస్తులను ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు అవసరమైనన్ని దరఖాస్తులను ‘ప్రజాపాలన’లో అందుబాటులో ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. మరోవైపు, రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని.. పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా వస్తాయని చెప్పారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే వీటికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
👉 – Please join our whatsapp channel here –