న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగించినట్లు మెట్రో ఎండీ తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయని తెలిపారు. చివరి మెట్రోరైళ్లు 12.15 గంటలకు బయలుదేరి.. ఒంటి గంటకు గమ్యస్థానాలకు చేరుతాయని చెప్పారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందన్నారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ హెచ్చరించారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
👉 – Please join our whatsapp channel here –