ఉత్తరాంధ్ర జిల్లాల వైకాపా ఇన్‌ఛార్జి వైవీ సబ్బారెడ్డి విశాఖలో నిర్వహించిన సమావేశం రసాభాసగా ముగిసింది. గాజువాక ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న ఉరుకూటి రామచంద్రరావు (చందు)కు అందరూ సహకరించాలని, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆయన వైపే ఉందని వైవీ సబ్బారెడ్డి ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గానికే టికెట్ ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డిని వైకాపా కార్యకర్తలు ఘెరావ్ చేశారు. ఐదేళ్లు కష్టపడి పనిచేసిన, పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిని ఓడించిన నాగిరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా నాగిరెడ్డికి సీటు ప్రకటిస్తే అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తామన్నారు. లేదంటే సహకరించమని నినాదాలతో హోరెత్తించారు. దీంతో సర్వేలు, సామాజిక వర్గాల సమీకరణాల్లో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ బీసీకి సీటు కేటాయించారని సుబ్బారెడ్డి తెలిపారు. అయినప్పటికీ కార్యకర్తల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నానని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –