* ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన సంఘటన
ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పులపాలై డబ్బు కోసం రెక్కీ నిర్వహించి ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన సంఘటనలో నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోరబండ పోలీస్ స్టేషన్ లో కేసు విషయమై శనివారం ఎస్ఆర్ నగర్ డివిజన్ ఏసీపీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ బోరబండ పోలీస్ స్టేషన్ లో ఇటీవల నాలుగు దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను సీసీ ఎస్ పోలీసులు , బోరబండ క్రైం టీంలు దర్యాప్తు ప్రారంభించాయి. అనంతరం డిసెంబర్ 29 న దొంగ ను పట్టుకున్నారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంకు చెందిన కొలిపక మణికంఠ (21)గా గుర్తించారు.ఇతను ఇంటర్ చదువుకున్నాడు. హైదరాబాద్ బీఎస్ మక్త లో నివసిస్తూ పంజాగుట్ట పీవీఆర్ మాల్ లో పని చేస్తుంటాడు. తరచూ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ లు ఆడుతూ అప్పుల పాలయ్యాడు. ఈ అప్పులు తీర్చడం కోసం, మళ్లీ బెట్టింగ్ లు ఆడటం కోసం దొంగతనం చేసి సులభంగా డబ్బు సంపాదించాలని భావించాడు. దాంతో బోరబండ ప్రాంతంలో రెక్కీ నిర్వహించాడు. ఉద్యోగాలు చేసుకునే వారు ఇంటి తాళాలు వేసి కీ లు బయట పెట్టడం చూసి ఇంటి యజమానులు వెళ్లిపోయాక దర్జాగా తాళం తీసుకుని బంగారం, డబ్బు తీసుకుని పరారయ్యేవాడు.అలా నాలుగు కేసులలో దాదాపు 12 లక్షల 21 వేల రూపాయిల ( 207 గ్రాముల బంగారం , నగదు 5 వేలు) చోరీకి పాల్పడ్డాడు. చివరికి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. నిందితుడు మణికంఠ వద్ద నుండి 54 గ్రాముల గోల్డ్ ని రికవరీ చేశామని ఏసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. సీసీ ఎస్ పోలీసులకు , బోరబండ క్రైం బ్రాంచ్ కి అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో బోరబండ ఇన్స్పెక్టర్ విజయ్ , డీఐ భూపాల్ గౌడ్ , ఇతర క్రైం సిబ్బంది పాల్గొన్నారు.
* ఇండిగో విమానంలో మహిళకు చేధు అనుభవం
ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ మరోసారి వివాదంలో ఇరుక్కుని వార్తల్లో నిలిచింది. ఎయిర్ ఇండియా విమానంలో అందించిన భోజనంపై ఓ ప్రయాణికులు రాలు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీకి చెందిన డైటీషియన్ ఖుష్బూ గుప్తా ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించారు. తనకు అందించిన శాండ్ విచ్‌లో బతికి ఉన్న పురుగు రావడంతో షాక్ అయింది. ఈ విషయాన్ని ఖుష్బూ గుప్తా తన అధికారిక ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.ఢిల్లీకి చెందిన ఖుష్బూ గుప్తా డిసెంబర్ 29వ తేదీన ఢిల్లీ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బయలు దేరారు. ఈ ప్రయాణంలో ఆమె ముందస్తుగానే వెజ్ శాండ్ విచ్‌ను ఆర్డర్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె విమానంలో ప్రయణిస్తున్నప్పుడు వెజ్ శాండ్ విచ్‌ను ఇండిగో సిబ్బంది సర్వ్ చేశారు.తీరా శాండ్ విచ్ చూసే సరికి అందులో బతికి ఉన్న పురుగు ప్రత్యక్షం అవడంతో ఖష్బూ గుప్తా షాక్ తింది. ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా.. సరిగా పట్టించుకోకపోవడంతో.. ఆ విషయాన్ని బాధతో ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. శాండ్ విచ్ గురించి చెప్తున్నా ఇండిగో సిబ్బంది పట్టించుకోకుండా.. శాండ్ విచ్‌ని పిల్లలకు, వృద్ధులకు ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. దీంతో ఈ విషయం కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. వారికి అనుభవించిన చేధు అనుభవాలను పంచుకున్నారు. ఇండిగో విమాన సంస్థ దృష్టికి చేరడంతో.. ఒక ప్రకటనలో సదరు మహిళకు క్షమాపణలు చెప్పింది సంస్థ. ప్రస్తుతం ఈ విషయం విచారణలో ఉందని వివరించింది. ఆహార విషయంలో మరింతగా శ్రద్ధ తీసుకుంటామని వెల్లడించింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తామని.. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని వివరించింది ఇండిగో సంస్థ.
* ఇదేం దోపిడీ
వలపు వల విసిరి ట్రాప్‌లోకి లాగే కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా బలవంతంగా ఎత్తుకొచ్చి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, కేరళలోని తిరునెల్లికి చెందిన వ్యాపారవేత్త సున్నీ ఫిర్యాదు మేరకు ఒక మహిళతో పాటు ముగ్గురిని మైసూరు నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు…కేరళలోని తిరునెల్లికి చెందిన వ్యాపారవేత్త సున్నీ మార్చిలో చైన్నె నుంచి కారులో వస్తున్న సమయంలో మైసూరు మానంద వాడి రోడ్డులో దుండగులు అడ్డుకుని బలవంతంగా ఎత్తుకెళ్లారు.అనంతరం ఒక ఇంటిలోకి తీసుకెళ్లి ఆయనను బెదిరించి ఓ మహిళ పక్కన నగ్నంగా పడుకోబెట్టి, ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అనంతరం అతని ఒంటిపై ఉన్న బంగారు చైన్, ఉంగరం తీసుకుని అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామని బెదిరించి ఉడాయించారు. దీంతో ఆయన రూ. 5 లక్షలు వారికి ఇచ్చాడు. మళ్లీ బెదిరింపులు రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిఘా ఉంచి నిందితులు ఫజలుల్లా రెహామన్, రిజ్వాన్, మోనాలను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.
* కొత్త మార్గాలను ఎంచుకుంటున్న గంజాయి స్మగ్లర్లు
డిసెంబర్ 31ని పురస్కరించుకొని గంజాయి స్మగ్లర్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం గంజాయి పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయినా కూడా గంజాయి స్మగ్లర్లు ఏమాత్రం తగ్గకుండా తమ పని తాము ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా చేసే ప్రక్రియ మాత్రం మానుకోవడం లేదు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ శివారులో 12 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు సీఐ శ్రీనివాస్, ఎస్సై వీరభద్ర రావు తెలిపారు.శుక్రవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి చింత నెక్కొండ క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మహారాష్ట్రలోని శివరాం తాలుకా తరాల మంగులిర్పుకు చెందిన శంకర్ అశోక్ పవార్ వద్ద 12 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ 3 లక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పట్టుకున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్, ఎస్సై వీరభద్ర రావు తెలిపారు.
* నకిలి నగలతో గోల్డ్ షాపులకే టోకరా
బంగారం అమ్మే షాపులును టార్గెట్ చేసింది ఒక మహిళ. ఒక మహిళ కారు లో దిగుతుంది. తన దగ్గర ఉన్న పాత బంగారు నగలను మార్చి వేరే నగలు తీసుకుంటానని షాపులకు వెలుతుంది. తన దగ్గర ఉన్న బంగారు నగలను ఇచ్చి కొత్త నగలు తీసుకుని వెలుతుంది. ఇందులో ఏముంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆమె ఇచ్చిన పాత బంగారం నకిలీ బంగారం. రాగి వస్తువులపై బంగారు కోటింగ్ వేసిన నగలను తెలివిగా జ్యువెలరీ షాపుల యజమానులను మాయ చేస్తుంది.పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఒక మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. జ్యూవెలరీ షాపు లలో బంగారు పూత వేసిన ఆభరణాలను మార్చి అసలైన బంగారు నగలను తీసుకుంటున్న మహిళను షాపు యజమాని గుర్తించారు. భీమవరం, నర్సాపురం పాలకొల్లు లలో పలు బంగారు షాపులలో నగలు మార్పిడి చేస్తుంది మహిళ. మహిళ అమ్మిన నగలు కరిగించా బంగారంలో రాగి ఎక్కువగా ఉందని గుర్తించిన షాపుల యజమానులు. రాగి వస్తువులపై బంగారు పూత వేసిన నగలను షాపుల్లో ఘరానాగా అమ్మేస్తుంది. మోసపోయిన షాపు యజమానులు వాట్స్ అప్ లలో మహిళ ఫోటో, వీడియోలు షేర్ చేసుకున్నారు. ఈ మహిళ వస్తే పెట్టుకోవాలని వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఆకివీడులోని ఒక జ్యూవెలరీ షాపు లో నగలు మారుస్తుండగా నిర్బందించారు. నిర్బందించిన షాపు యజమాని మోస పోయిన వారికి సమాచారం అందించాడు. తాను ఆన్లైన్ షాపింగ్ లో వస్తువులు కొని అమ్ముతున్నట్టు మహిళ చెబుతుంది. ఈ మహిళ కృష్ణా జిల్లా మచిలీపట్నం కు చెందినదిగా గుర్తించారు. మహిళ బంధువులకు సమాచారం అందించారు షాపు యజమానులు. ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం అందలేదంటున్నారు పోలీసులు.ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ బంగారం విషయంలో షాపుల యజమానులే మోసపోతుంటే సామాన్యులకు బంగారం అని ఇటువంటి నకిలీ బంగారు నగలు అమ్మితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బులు పోగుచేసి బంగారం కొందామని వెళితే ఇటువంటి మోసగాళ్ళు వద్ద ఏం జరుగుతుందో తెలియని పరిస్తితి ఏర్పడిందని అంటున్నారు. బంగారం షాపుల యజమానుల అప్రమత్తంగా ఉండి బయట వ్యక్తుల నుండి బంగారుం కొనేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని, పరీక్షించి తీసుకోవాలని సూచిస్తున్నారు.
* అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ మృతి
ఖమ్మం 4వ డివిజన్ బాలాజీనగర్‌లో నివాసముంటూ భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న మీగడ స్వాతి (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఖమ్మం అర్బన్ ఎస్‌ఐ పి.వెంకన్న కథనం ప్రకారం.. స్వాతి రెండేళ్ల కిందట ఖమ్మంలో విధులు నిర్వర్తిస్తున్న సమయాన రాజీవ్‌నగర్‌గుట్టకు చెందిన కారుడ్రైవర్ ప్రవీణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.కొన్ని నెలలు పాటు దాంపత్య జీవితం సజావుగానే సాగింది. వీరికి 19 నెలల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వరకట్నం తీసుకురావాలని ప్రవీణ్ వేధిస్తుండడంతో స్వాతి అప్పు చేసి రూ.9 లక్షలు, తండ్రి నుంచి మరో రూ.14 లక్షలకు పైగా ఇప్పించింది. అయినా సంతృప్తి చెందని ప్రవీణ్ మద్యం సేవిస్తూ ఏపని చేయకుండా నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలోనే గురువారం ఇంట్లో స్వాతి, ప్రవీణ్ ఘర్షణ పడినట్లు తెలుస్తుండగా పెద్దగా శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు.దీంతో సమీపంలోనే ఉండే స్వాతి సోదరి కవిత వచ్చేసరికి స్వాతి కిందపడుకుని, ఉందని, ఏమైందని ఆరా తీస్తే ఉరి వేసుకుందని ప్రవీణ్ చెప్పాడని కవిత వెల్లడించింది. అనంతరం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. కాగా, ప్రవీణ్ ఉరి వేసి స్వాతిని హత్య చేసినట్లు తమకు అనుమానాలు ఉన్నాయని కవిత ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –