గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని టీఎస్‌ఆర్టీసీ భూములు లీజుకు ఇచ్చేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. ఈ మేరకు ఈ-టెండరు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఆహ్వానిస్తోంది. కాచిగూడలో 4.14 ఎకరాలు, మేడ్చల్‌లో 2.83 ఎకరాలు, శామీర్‌పేటలో 3.26 ఎకరాలు, హకీంపేటలో 2.93 ఎకరాలు.. ఇలా మొత్తం 13.16 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. పూర్తి వివరాలకు https://www.tsrtc.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించింది. టెండర్లకు చివరి తేదీని వచ్చే ఏడాది జనవరి 18గా నిర్దేశించింది.
👉 – Please join our whatsapp channel here –