మేషం
చాలావరకు సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమా జంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవు తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఆశాభావంతో వ్యవహరిస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. చదువుల్లో పిల్లలు పురోగతి సాధిస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
వృషభం
ఆస్తి వివాదం పరిష్కార దిశగా కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు. ఉద్యోగంలో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. మానసిక ఒత్తిడి నుంచి చాలా వరకు బయట పడతారు. కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. పిల్లల పురోగతికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. ఆహార, విహారాల్లో తగిన వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం మంచిది.
మిథునం
ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలావరకు కోలుకోవడం జరుగుతుంది. ముఖ్యమైన పనులు వేగంగా, చురుకుగా పూర్త వుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబసమేతంగా ఆలయాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ వాతావరణం అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఆరోగ్య భంగమేమీ ఉండక పోవచ్చు.
కర్కాటకం
ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఏర్పడుతుంది. స్నేహితుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. విదేశాలలో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన శుభ వార్త అందుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది.
సింహం
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం నిలకడగా ముందుకు సాగుతాయి. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఎదు రవుతాయి. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టం కలుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
కన్య
వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలను చాలావరకు చక్కబెడతారు. సతీమణి నుంచి సహకారం లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యాపారంలో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. దాంపత్య జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
తుల
వృత్తి జీవితం బాగా బిజీ అవుతుంది. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. పెళ్లి ప్రయ త్నాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. అవసరానికి ఉపయోగించుకునేవారు దగ్గర చేరతారు. మీ ఆలోచనలు ఫలిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కుటుంబ వ్యవహారాలను పూర్తి చేస్తారు.
వృశ్చికం
ఇష్టమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగంలో అధికారులు, సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరుగుతాయి. ఆదాయ మార్గాలలో మెరుగుదల కనిపిస్తుంది. నూతన వస్తు లాభం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు
సమయం అనుకూలంగా ఉంది. రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం దిశగా సాగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. కొందరు బంధుమిత్రుల నుంచి శుభవార్త అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాల్లో ఇబ్బందులను, సమస్యలను అధిగ మిస్తారు. అనవసర పరిచయాలకు దూతరంగా ఉండడం మంచిది. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.
మకరం
ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభి స్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి సహాయ సహకారాలుందుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు తగ్గుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉంటుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆరోగ్యం పరవాలేదని పిస్తుంది.
కుంభం
ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఏ విషయంలోనూ తొందరపాటుతో వ్యవహరించవద్దు. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి కావడానికి అవకాశం ఉంది. ప్రయాణాలో డబ్బు వృథా అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా శ్రమ పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అంది, ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. అయితే, వృథా ఖర్చులు పెరుగు తాయి. మిత్రుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దాంపత్య జీవితం సాఫీగా సాగి పోతుంది.
మీనం
వృత్తి, వ్యాపారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో సంతృప్తి కర వాతావరణం ఉంటుంది. బంధువులతో అపార్థాలు తొలగిపోతాయి. ఆటంకాలున్నప్పటికీ, ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. తల్లితండ్రుల నుంచి అండదండలు లభిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.
👉 – Please join our whatsapp channel here –