ScienceAndTech

వాట్సాప్‍లో మరో కొత్త ఫీచర్

వాట్సాప్‍లో మరో కొత్త ఫీచర్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను తీసుకొని వస్తుంది.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ ను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఈ ఫీచర్ వల్ల కళ్ళకు ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది.. ప్రస్తుతం వాట్సాప్‌ బీటా వెర్షన్‌లో ఫీచర్‌ను టెస్టింగ్‌ దశలో ఉన్నది. కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండడానికి ఇప్పటికే వాట్సాప్‌లో డార్క్‌ మోడ్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిని కొత్తగా అప్‌డేట్ చేయాలని వాట్సాప్‌ ప్లాన్‌ చేస్తోంది.. ఈ ఫీచర్ గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం..

యూజర్ల కంటిపై ఒత్తిడి పడకుండా ఉండేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. వాట్సాప్ వెబ్‌లో కొత్త కలర్స్, టాప్ బార్, బ్యాక్‌గ్రౌండ్, మెసేజ్ బబుల్స్‌లో కలర్ స్కీమ్, సైడ్‌బార్‌ను మరింత ఆధునికంగా రీడిజైన్ చేసి, తక్కువ కాంతిని ఇచ్చే విధంగా అప్డేట్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ ఫీచర్ అందరికీ బాగుంటుందని చెబుతున్నారు.. ఇదిలా ఉంటే వాట్సాప్‌ ఇది వరకే 2020లో వెబ్‌ వెర్షన్‌ కోసం డార్క్‌ మోడ్‌ను విడుదల చేసింది. ఇప్పుడు ఇదే ఫీచర్‌ను అప్‌డేట్ చేస్తూ మరింత తక్కువ లైట్‌తో పనిచేసేలా చేయనున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేష్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇకపోతే ఇటీవలే స్టేటస్‌లో వాట్సాప్ వెబ్ నుంచి స్టేటస్‌లకు ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్ ను షేర్‌ చేసే అవకాశం వాట్సాప్‌ కల్పిస్తోంది. ఈ కొత్త ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందుబాటులోకి వస్తే ల్యాప్‌టాప్‌, కంప్యూటర్ల నుంచి సైతం వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కలుగనున్నది. స్టేటస్‌ అప్‌డేట్‌ చేసిన సమయంలో కంటెంట్ మొత్తం ఎండ్-టు-ఎండ్ ప్రొటెక్ట్ చేయబడుతుందని వాట్సాప్‌ బీటా ఇన్ఫో తెలిపింది.. ఈ ఫీచర్ ముందుగా ఆండ్రాయిడ్ యూజర్స్ కు అందుబాటులోకి తీసుకొచ్చారు.. ఇప్పటి వరకు వచ్చిన ఫీచర్స్ అన్ని కూడా యూజర్స్ కు సంతృప్తిని ఇచ్చాయని తెలుస్తుంది.. ఇక ముందు ఇంకా మరెన్నో ప్రైవసీ ఫీచర్స్ ను తీసుకురావాలనే యోచనలో వాట్సాప్ ఉంది..

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z