గతేడాది మాదిరిగానే 2024లో కూడా క్రికెట్ అభిమానులకు ‘పొట్టి క్రికెట్’ వినోదాన్ని పంచనున్నది. టెస్టులు, వన్డేలతో పోలిస్తే నాలుగు గంటల్లోనే ముగిసే టీ20 క్రికెట్ విస్తృతి పెరిగిన నేపథ్యంలో క్రికెట్ ఆడే ప్రతి దేశం ఫ్రాంచైజీ క్రికెట్‌కు అధిక ప్రాధాన్యమిస్తోంది. భారీ స్థాయిలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)తో పాటు టీ20 వరల్డ్ కప్‌లు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనున్నాయి. ఈ ఏడాది వివిధ దేశాలలో జరుగబోయే టీ20 క్రికెట్ లీగ్‌ల వివరాలు ఇక్కడ చూద్దాం.
2024 ప్రారంభానికి ముందే బిగ్ బాష్ లీగ్ మొదలుకాగా ఈ నెల పూర్తయ్యేదాకా ఈ సీజన్ నడుస్తోంది. ఇక జనవరి 9 నుంచి ఫిబ్రవరి 10 దాకా సౌతాఫ్రికా వేదికగా ఎస్‌ఎ20 మొదలుకాబోతుంది. ఈ ఏడాది మొదలయ్యే తొలి టీ20 క్రికెట్ లీగ్ ఇదే. దీని తర్వాత ఇంటర్నేషనల్ లీగ్ టీ20, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో క్రికెట్ అభిమానులు బిజీబిజీగా గడపనున్నారు.
– ఎస్‌ఎ20 – జనవరి 9 నుంచి ఫిబ్రవరి 10 దాకా.. దక్షిణాఫ్రికాలో..
– ఇంటర్నేషనల్ లీగ్ టీ20 – జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17 దాకా.. యూఏఈలో..
– బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) -జనవరి 19 నుంచి మార్చి 1 దాకా.. బంగ్లాదేశ్‌లో..
– పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) – ఫిబ్రవరి 13 నుంచి మార్చి 19 దాకా.. పాకిస్తాన్‌లో..
– ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – మార్చి 26 నుంచి మే 26 దాకా.. (అధికారికంగా తేదీలు ప్రకటించలేదు).. భారత్‌లో..
– వైటాలిటీ బ్లాస్ట్ – మే 30 నుంచి సెప్టెంబర్ 14 దాకా.. ఇంగ్లండ్‌లో
– టీ20 వరల్డ్ కప్ – జూన్ 4 నుంచి జూన్ 30 దాకా.. వెస్టిండీస్, అమెరికాలో..
– మేజర్ క్రికెట్ లీగ్ (ఎంఎల్‌సీ).. జులైలో.. అమెరికాలో..
– ద హండ్రెడ్ లీగ్ – ఆగస్టులో.. ఇంగ్లండ్
– కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) – ఆగస్టు నుంచి సెప్టెంబర్ దాకా.. వెస్టిండీస్‌లో..
– టీ10 లీగ్.. అక్టోబర్‌లో.. యూఏఈలో..
– బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్).. డిసెంబర్-జనవరి.. ఆస్ట్రేలియాలో..
👉 – Please join our whatsapp channel here –