* అత్యాచారాలకు కేరాఫ్‌గా మారుతున్న ఢిల్లీ
దేశ రాజధాని ఢిల్లీ అత్యాచారాలకు కేరాఫ్‌గా మారుతోంది. ఒంటరిగా ఆడవాళ్లు కనబడితే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. నోయిడాలోని ఓ షాపింగ్ మాల్ సమీపంలో 26 ఏళ్ల యువతిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు, స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తితో పాటు మరో కీలక నిందితుడు ఇద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.అయితే, ఈ గ్యాంగ్ రేప్ కొన్ని రోజుల క్రితం జరిగింది. నిందితులంతా స్థానికంగా బలమైన వ్యక్తుల కావడంతో యువతి ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇదే అలసుగా బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధిస్తుండటంతో యువతి ధైర్యం చేసి డిసెంబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సెక్టార్ 39 పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పట్టుబడిన ముగ్గురు నిందితులను రాజ్‌కుమార్, ఆజాద్, వికాస్‌లుగా గుర్తించారు. మరో ఇద్దరు నిందితులు రవి, మెహ్మీ పరారీలో ఉన్నారని, వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. స్థానిక కోర్టు పట్టుబడిన వారికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది
* సైబర్ నేరగాళ్ల నయా మోసం
రాష్ట్రంలోని వాహనాల పెండింగ్ చలాన్లపై (Pending Challans) ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. గత నెల 26 నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్ల చెల్లింపునకు అకాశం కల్పించింది. దీంతో వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తున్నది. ఇప్పుడు దీనిని సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. నకిలీ వెబ్‌సైట్‌తో వాహనదారులను కేటుగాళ్లు మోసంచేస్తున్నారు. www.echallantspolice.in పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించి చలాన్లు వసూలు చేస్తున్నారు. గుర్తించిన పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేశారు.నకిలీ వెబ్‌సైట్‌లో పేమెంట్స్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. పేటీఎం, మీసేవా కేంద్రాల్లో పెండింగ్ చలాన్స్ క్లియర్ చేయాలని సూచించారు. అదేవిధంగా www.ehallan.tspolice.gov.in/publicview వెబ్‌సైట్‌లో చెల్లించాలని తెలిపారు. నకిలీ వెబ్‌సైట్‌ను ఎవరు సృష్టించారనే విషయమై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.బైక్‌లు, ఆటోలకు 80 శాతం, ఫోర్ వీలర్లకు 60 శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90 శాతం, భారీ వాహనాలపై 50 శాతం రాయితీని ప్రకటించారు. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉండటంతో పోలీసుశాఖ ఈ నిర్ణయం తీసుకొన్నది. నిరుడు రాయితీ ప్రకటనతో 45 రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల ఆదాయం సమకూరింది.
* తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరపల్లి మండల పరిధిలోని బంధపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. నందిగామ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ కారు దేవరపల్లి మండలం జాతీయ రహదారి బంధపురం వద్దకు రాగానే కారు టైరు పేలి.. డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారుపైకి వేగంగా దూసుకెళ్లింది.ప్రమాదం జరిగిన సమయంలో రెండు కార్లలో కలిపి 11 మంది ప్రయాణిస్తున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారులో ఏడుగురు ప్రయాణికులు ఉండగా.. వారిలో సుభాష్ అనే వ్యక్తి తల్లి, భార్య, కుమార్తె సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు ఆస్పత్రులకు తరలించారు.
* ఫొటోషూట్‌కి తల్లిదండ్రులు అనుమతించకపోవడంతో ఓ యువతి ఆత్మహత్య
షాపింగ్ మాల్‌లో ఫొటోషూట్‌కు తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. సుధామనగర్‌కు చెందిన ఓ యువతి (21) ఫొటోగ్రఫీ కోర్సు పూర్తి చేసింది. ప్రస్తుతం బీబీఏ చదువుతోంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక మాల్‌లో ఫొటోషూట్ చేయాలనుకొంది. ఇందుకు తల్లిదండ్రులను అనుమతి కోరగా.. వారు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి ఇంట్లోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. మరుసటి రోజు గదిలో తమ కూతురు శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమె గదిని పరిశీలించిన వారు అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్‌ను గుర్తించలేదు. దీంతో ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* ప్రెస్ మీట్లో ఉండగానే ప్రతిపక్ష నేతపై దాడి
దక్షిణ కొరియా ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ పార్టీ ప్రముఖ నేత లీ జే-మ్యూంగ్‌పై దాడి జరిగింది. ఇందులో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బుసాన్ పర్యటన సందర్భంగా లీ జే-మ్యూంగ్ జర్నలిస్టులతో మాట్లాడుతున్నప్పుడు ఈ దాడి జరిగింది. అదే సమయంలో ఆయన దుండగుడు మెడపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి నేలపై పడిపోయాడు. ఈ ఘటన చుట్టుపక్కల కలకలం సృష్టించింది. ఘటనా స్థలంలో ఉన్న వ్యక్తులు దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మొత్తం సంఘటన వీడియో కూడా బయటపడింది. ఇందులో లీ జే-మ్యుంగ్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఎలా దాడి చేశాడో స్పష్టంగా చూడవచ్చు. దాడి చేసిన వ్యక్తి లీ జే-మ్యుంగ్ ముందు నిలబడి ఉన్నాడు. జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిస్తుండగా తన మెడపై కత్తితో పొడిచాడు.
* అందమైన కోడలిని చూసి ఆగలేకపోయిన మామ
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు కలియుగాంతంలో కామం పెరిగిపోతుందని, వరసలు మరిచి మనుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారనేది నేడు నిజమవుతుంది. సొంత కుమారుడి భార్యపై మోజుపడ్డ ఓ తండ్రి ఆమెను లొంగదీసుకొని అనేక రోజులు ఎంజాయ్ చేశాడు. కోడలు కూడా మామ ప్రేమలో మునిగిపోయింది. ఆఖరికి ఆ కొంప కొల్లేరయింది. మధ్యప్రదేశ్‌లోని భూత్ బంధాని గ్రామానికి చెందిన దరోగ్ సింగ్ అనే వ్యక్తి కొడుకు సంజయ్ ధుర్వేతో కలిసి ఉంటున్నాడు. అయితే సంజయ్‌కు కొంత కాలం క్రితం ఓ యువతితో వివాహం జరిగింది.ఆమె చాలా అందంగా ఉండటంతో దరోగ్ సింగ్ ఆమెపై మోజు పెంచుకున్నాడు. వీరు ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. కొడుకు రోజూ ఉదయం పనికి వెళ్లి సాయంత్రానికి తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో దరోగ్ సింగ్ కోడలితో మనసులో మాట చెప్పాడు. మొదట కాదన్నా కొన్నాళ్లకు కోడలు సైతం మామపై ఇష్టం పెంచుకుంది. ఇక కొడుకు లేని సమయంలో దరోగ్ సింగ్ కోడలితో కలిసి శారీరకంగా ఎంజాయ్ చేసేవాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత తండ్రి, భార్యపై సంజయ్‌కు అనుమానం వచ్చింది. తండ్రికి తన భార్యతో అక్రమ సంబంధం ఉందని తెలుసుకుని కోపంతో రగిలిపోయాడు. విషయం తేల్చాలని సంజయ్ తన తండ్రిని ఓ చోటుకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక అక్రమ సంబంధం విషయమై తండ్రిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం కోపంతో సంజయ్ తన తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు. కొంత సమయానికి విషయం తెలుసుకున్న సంజయ్ భార్య ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ ఇల్లు వల్లకాడుగా మారింది. ఇలాంటి సంఘటనలు ప్రతి రోజూ పేపర్లలో, టీవీలలో చూస్తున్నా జనం మాత్రం మారడం లేదు.చివరికి వారిపై నిఘా పెట్టాడు.
* బోరుబావిలో పడ్డ చిన్నారి ఘటన
గుజరాత్‌లో బోరుబావిలో పడ్డ చిన్నారి ఘటన విషాదాంతమైంది. సైనిక, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించి ఆ చిన్నారిని ప్రాణాలతో బయటకు తీసినప్పటికీ.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడవడం అందరినీ కలచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని దేవభూమి ద్వారక జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఓ చిన్నారి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడింది. వెంటనే పోలీసులు ‘జాతీయ విపత్తు స్పందన దళం (NDRF)’తో పాటు సైనిక వర్గాలకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఆయా బృందాలు తొమ్మిది గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశారు. అందుకోసం తాడు, ఓ లోహపు కొక్కేన్ని ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు.అయితే, బయటకు తీసే సమయానికే చిన్నారి అపస్మారక స్థితికి చేరుకొంది. వెంటనే గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో తమ పాప మృంత్యుంజయురాలిగా తిరిగొచ్చిందని సంతోషించే లోపే శాశ్వతంగా దూరం కావడం తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
* హైబీపీతో హెడ్ కానిస్టేబుల్ మృతి
విధుల్లో ఉండగా రక్తపోటు(బీపీ) అధికమై చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు(Head Constable Srinivasulu) మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పోలీస్‌స్టేషన్ (Kalvakurti Police Station)లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు విధులు నిర్వహిస్తుండగానే ఒక్కసారిగా అధిక రక్తపోటుకు గురై కిందపడిపోయాడు. గుర్తించిన సహచరులు దవాఖానకు తరలించారు. కాగా, హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ శ్రీనివాసులు మృతి చెందాడు.
👉 – Please join our whatsapp channel here –