వేతనాల పెంపు, గ్రాట్యుటీ సహా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత 22 రోజులుగా ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సమస్యలు పరిష్కరించే వరకు నిరసన ఆపేది లేదని ప్రభుత్వానికి ఇప్పటికే ఆంగన్వాడీలు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జనవరి 5వ తేదీలోగా విధులకు హాజరుకావాలని..లేకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల ద్వారా ‘ప్రభుత్వ విజ్ఞప్తి’ పేరుతో అంగన్వాడీలకు నోటీసులు జారీ చేయించింది. అంగన్వాడీల సమ్మె కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వారికి ఇప్పటికే పూర్తి చేసిన హామీలను వివరిస్తూ ప్రభుత్వం నోట్ జారీ చేసింది.
👉 – Please join our whatsapp channel here –