పార్టీ ముఖ్యనేతలతో వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో అత్యవసర భేటీ నిర్వహించారు. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో ఆమె చర్చించినట్లు తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీ విలీనంపై ఆమె త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి ఆమె దిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ భేటీ అనంతరం షర్మిల ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. తండ్రి వైఎస్‌ఆర్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు. కుమారుడు రాజారెడ్డి వివాహం సందర్భంగా తండ్రి ఆశీర్వాదం కోసం ఆమె వెళ్లనున్నారు. నూతన వధూవరులు రాజారెడ్డి, ప్రియతో కలిసి షర్మిల ఇడుపులపాయకు చేరుకుంటారు.
👉 – Please join our whatsapp channel here –