సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 32 ప్రత్యేక రైళ్లను నడపనుంది. సొంత ఊళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం పలు మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్-బ్రహ్మపుర్, బ్రహ్మపుర్-వికారాబాద్, విశాఖపట్నం-కర్నూలు సిటీ, శ్రీకాకుళం-వికారాబాద్, సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-నర్సాపూర్ రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. జనవరి 7వ తేదీ నుంచి జనవరి 27 మధ్య వివిధ తేదీల్లో ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మరిన్ని వివరాలు, రైళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం https://www.irctc.co.in/nget/train-search క్లిక్ చేయండి.
👉 – Please join our whatsapp channel here –