Kids

మద్యం తాగుతున్న విద్యార్థులు

మద్యం తాగుతున్న విద్యార్థులు

మద్య నిషేధానికి చర్యలు తీసుకుంటామంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన సీఎం జగన్‌ అధికారం చేపట్టాక ఆ విషయాన్నే మర్చిపోయారు. ఊరువాడా పెద్దఎత్తున మద్యం అమ్మకాలు చేపడుతూ ఆదాయమే తమ లక్ష్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుకాణాల్లోనే విక్రయించాల్సిన మద్యం ఎక్కడ పడితే అక్కడ లభ్యమవుతుండటంతో విద్యార్థులూ మత్తుకు బానిసలవుతున్నారు. తల్లిదండ్రులకు, స్వగ్రామాలకు దూరంగా వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల్లో కొందరు శని, ఆదివారాల్లో మందు పార్టీలు చేసుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో వెలుగుచూసిన ఈ ఘటనే ఇందుకు నిదర్శనం. ఇక్కడి ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 6, 7, 10 తరగతులకు చెందిన 16 మంది విద్యార్థులు డిసెంబరు 31వ తేదీ రాత్రి వసతి గృహం గోడదూకి బయటకు వెళ్లారు. బయటి నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులతో కలిసి వసతి గృహం సమీపంలో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్‌మెంటుకు చేరుకొని బిర్యానీ, మందు పార్టీ చేసుకున్నారు. రాత్రంతా మత్తులో ఊగారు. వారంతా అల్లరి చేస్తుండటం గమనించిన ఏసీ మెకానిక్‌, డ్రైవింగ్‌ స్కూల్‌ డ్రైవర్‌ ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు విద్యార్థులు వారిని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఏసీ మెకానిక్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z