ఓ ట్రాన్స్‌జెండర్ ఉన్నత చదువులు చదివింది. టీచర్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేసింది. ఇక సంపాదన కోసం టీచర్‌గా చేరింది. కానీ కొన్నాళ్లకు ఆమె ట్రాన్స్‌జెండర్ అని తెలియడంతో విధుల నుంచి తొలగించారు. ఈ లింగ వివక్షతను సవాల్ చేస్తూ ట్రాన్స్‌జెండర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివ్లా, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ విచారణకు స్వీకరించింది. ఈ మేరకు కేంద్రం, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు గుజరాత్‌లోని జామ్‌నగర్ పాఠశాలకు, యూపీలోని ఓ ప్రయివేటు పాఠశాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ట్రాన్స్‌జెండర్ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది కోర్టు.
మొదట ఆ ట్రాన్స్‌జెండర్ ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రయివేటు పాఠశాలలో టీచర్‌గా చేరింది. ఆమెకు అపాయింట్‌మెంట్ లెటర్ కూడా జారీ చేసింది పాఠశాల యాజమాన్యం. ఆరు రోజుల తర్వాత ఆమె ట్రాన్స్‌జెండర్ అని తేలడంతో విధుల నుంచి తొలగించారు. ఇక గుజరాత్ స్కూల్ కూడా ఈ మాదిరిగానే ప్రవర్తించింది. అసలు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు.
👉 – Please join our whatsapp channel here –