Business

సింగిల్ చార్జ్ పై 127కి.మీ ప్రయాణించే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

సింగిల్ చార్జ్ పై 127కి.మీ ప్రయాణించే చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌

బజాజ్‌ ఆటో తాజాగా నవీకరించిన చేతక్‌ విద్యుత్‌ స్కూటర్‌ను ఈ నెల 9న విపణిలోకి విడుదల చేయబోతోంది. స్టైలింగ్‌, మెకానికల్స్‌లో సరైన, ప్రధాన సవరణలు చేసి, ఈ మోడల్‌ను తీసుకురాబోతోంది. ఈ విద్యుత్‌ స్కూటర్‌ 3.2 కిలోవాట్ అవర్‌ బ్యాటరీ ప్యాక్‌తో రాబోతోంది. ఒకసారి ఛార్జింగ్‌తో (ఐడీసీ) 127 కి.మీ. ప్రయాణించొచ్చు. 0-100 శాతం ఛార్జింగ్‌ అయ్యేందుకు 4 గంటల 30 నిమిషాలు సమయం పడుతుందని సంస్థ తెలిపింది. ప్రస్తుత బజాజ్‌ చేతక్‌ విద్యుత్‌ స్కూటర్‌ గంటకు 63 కి.మీ. గరిష్ఠ వేగంతో నడుస్తుండగా, కొత్త మోడల్‌ 73 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z