DailyDose

అధిక పింఛను వివరాల అప్‌లోడ్‌కు గడువు పొడిగింపు

అధిక పింఛను వివరాల అప్‌లోడ్‌కు గడువు పొడిగింపు

అధిక పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారి వేతన వివరాలను యాజమాన్యాలు తమకు సమర్పించడానికి గడువును ఈ ఏడాది మే 31 వరకు పొడిగిస్తున్నట్లు ‘ఉద్యోగ భవిష్య నిధి సంస్థ’ (ఈపీఎఫ్‌వో) ప్రకటించింది. తొలుత విధించిన గడువు గత నెల 31తో ముగిసిపోయిందని కార్మిక మంత్రిత్వశాఖ తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక పింఛన్‌కోసం ఈపీఎఫ్‌వో సంస్థ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరించిన విషయం తెలిసిందే. గత ఏడాది జులై 11 వరకు ఇచ్చిన తుది గడువులోగా 17.49 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. సభ్యులు, పింఛన్‌దారుల వేతన వివరాలు అప్‌లోడ్‌ చేయడానికి యాజమాన్యాలు అదనపు గడువు కోరడంతో తొలుత 2023 సెప్టెంబరు 30 వరకు, తర్వాత ఆ ఏడాది డిసెంబరు నెలాఖరు వరకు పొడిగించారు. సుమారు 3.6 లక్షల దరఖాస్తులకు సంబంధించిన వివరాలు యాజమాన్యాల నుంచి రావాల్సి ఉండడంతో ఇప్పుడు మరోసారి అదనపు గడువునిచ్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z