Politics

ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్న రేవంత్‌

ఏఐసీసీ సమావేశంలో పాల్గొననున్న రేవంత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిల్లీ వెళ్లారు. సీఎస్‌ సహా ముఖ్య అధికారులతో కలిసి బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఇవాళ, రేపు ఆయన దిల్లీలో పర్యటించనున్నారు. సీఎం వెంట సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తదితరులు ఉన్నారు.

ఇవాళ దిల్లీలో నిర్వహించే ఏఐసీసీ సమావేశంలోనూ రేవంత్‌ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కార్పొరేషన్‌ పదవుల భర్తీ, ఇతర అంశాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చించనున్నారు. ఈ నెల 14న సీఎం దావోస్‌ పర్యటనకు వెళుతున్నందున ఈలోగా కొన్ని పదవులను భర్తీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసినవారిలో ఎవరెవరికి ఏయే పదవులు ఇవ్వాలనే జాబితాలను ఏఐసీసీ కార్యదర్శులు తయారు చేస్తున్నారు. ఈ జాబితాలపై అధిష్ఠానంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని.. వీటిపై గురువారం దిల్లీలో చర్చిస్తారని సమాచారం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z