Devotional

అయోధ్యలో భక్తులకు ఇచ్చే ప్రసాదం ఇదే!

అయోధ్యలో భక్తులకు ఇచ్చే ప్రసాదం ఇదే!

అయోధ్య రామాలయ సందర్శనకు వచ్చే భక్తులకు ఏలకుల (ఇలాచీదానా) ప్రసాదాన్ని అందించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు నిర్ణయించింది. పంచదార, ఏలకులతో తయారుచేసే ఇలాచీదానాను ఇప్పటికే దేశంలోని కొన్ని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్నారు. ఈ ప్రసాదం తయారీ బాధ్యతను రామ్‌విలాస్‌ అండ్‌ సన్స్‌ దుకాణానికి అప్పగించారు. ‘‘ఇలాచీదానా ఉదర సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. పూర్వాంచల్‌ ప్రాంతం నుంచి కూడా వచ్చి దీన్ని ప్రసాదంగా మా వద్ద కొనుగోలు చేస్తారు’’ అని దుకాణ యజమాని బోల్‌ చంద్రగుప్తా తెలిపారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనున్న జనవరి 22లోపు 5 లక్షల ఇలాచీదానా ప్రసాదం ప్యాకెట్లను ఆలయ ట్రస్టుకు అందించేందుకు వీరు కృషి చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z