Politics

భారాస నేతలు చెబుతారా?

భారాస నేతలు చెబుతారా?

అధికారంలోకి వచ్చిన 25 రోజుల్లోనే 6 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు. హైదరాబాద్‌లోని భోలక్‌పూర్‌లో బుధవారం ఆయన పర్యటించారు. ప్రజాపాలన దరఖాస్తుల కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. ఆటో డ్రైవర్లతో ధర్నా చేయించడంలో భారాస ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వద్దని భారాస నేతలు చెబుతారా?అని నిలదీశారు. ప్రజాపాలనకు వచ్చే స్పందన చూసి వారికి నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z