శ్రీవారి ఆలయ సమీపంలో కొంతకాలంగా చిన్నారులు భిక్షాటన చేస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు పనులు చేసేందుకు వచ్చే కొంతమంది కార్మికుల పిల్లలు, ఇతర ప్రాంతాల నుంచి భిక్షాటన కోసం వచ్చే మరికొంతమంది తమ పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారు. ప్రశాంతత కోసం శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు యాచకులతో ఇబ్బంది పడుతున్నారు. ఇంత జరుగుతున్నా సమీపంలో విధులు నిర్వహించే తితిదే భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. తల్లిదండ్రులను, సంరక్షకులను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, చిన్నారులను స్థానిక పాఠశాలలకు పంపేలా చైతన్యం తీసుకురావాలని కోరుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z