NRI-NRT

కుంభకోణంలో బయటకు వచ్చిన క్లింటన్ ట్రంప్ పేర్లు

కుంభకోణంలో బయటకు వచ్చిన క్లింటన్ ట్రంప్ పేర్లు

అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్‌ సెక్స్‌ కుంభకోణం (sex scandal) మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ ఫైనాన్షియర్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ (Jeffrey Epstein) దుర్మార్గాల చిట్టాను న్యూయార్క్‌ కోర్టు తాజాగా బయటపెట్టింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసే ప్రక్రియను బుధవారం ప్రారంభించారు. తొలి విడతగా 40 పత్రాలను విడుదల చేశారు. ఈ కుంభకోణంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌ క్లింటన్‌ (Bill Clinton), డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సహా పలువురు ప్రముఖులు, సంపన్నుల పేర్లు బయటకు వచ్చాయి.

తాజాగా విడుదల చేసిన పత్రాల్లో చాలా వరకు ఎప్‌స్టీన్‌ కేసుకు సంబంధించిన న్యూస్‌పేపర్‌ కథనాలు, టీవీ డాక్యుమెంటరీలు, ఇంటర్వ్యూలు, బాధితుల వాంగ్మూలాలు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌తో ఎప్‌స్టీన్‌ సాన్నిహిత్యం, బ్రిటన్‌ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్‌ ఆండ్రూపై వచ్చిన ఆరోపణల వంటి వివరాలు వీటిలో ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లలో పాప్‌ ఐకాన్‌ మైఖెల్‌ జాక్సన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ సహా దాదాపు 200 మంది ప్రముఖుల పేర్లు ఉండటం గమనార్హం.

ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు చేసిన జొహన్నా సోబెర్గ్‌ ఇచ్చిన వాంగ్మూలంలో మైఖెల్‌ జాక్సన్‌ ప్రస్తావన ఉంది. ఎప్‌స్టీన్‌కు చెందిన ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌ నివాసంలో తాను ఓ సారి ఆయన్ను కలిసినట్లు పేర్కొన్నారు. అయితే, అప్పుడు ఆ పాప్‌స్టార్‌ తనను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయలేదని తెలిపారు.

ప్రిన్స్‌ ఆండ్రూ అసభ్యంగా తాకాడు..
సోబెర్గ్‌ ఇచ్చిన మరో వాంగ్మూలంలో ఆమె ప్రిన్స్‌ ఆండ్రూపై సంచలన ఆరోపణలు చేశారు. 2001లో తాను న్యూయార్క్‌ వెళ్లినప్పుడు ఎప్‌స్టీన్‌ నివాసంలో ఓ గ్రూప్ ఫొటో దిగామని ఆమె తెలిపారు. అప్పుడు ప్రిన్స్‌ తనని అసభ్యంగా తాకినట్లు పేర్కొన్నారు. ఇదే వాంగ్మూలంలో బిల్‌ క్లింటన్‌, ట్రంప్‌ పేర్లను కూడా ఆమె ప్రస్తావించారు.

‘‘న్యూయార్క్‌కు వెళ్తున్నప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఎప్‌స్టీన్‌ తన ప్రైవేట్‌ జెట్‌ను న్యూజెర్సీలోని అట్లాంటిక్‌ సిటీకి మళ్లించాడు. అక్కడ మేం కొన్ని గంటల పాటు ట్రంప్‌ క్యాసినోలో ఉన్నాం. అయితే, నేను ఆయన్ను కలవలేదు. ఇక బిల్‌ క్లింటన్‌ను కూడా నేనెప్పుడూ ప్రత్యక్షంగా కలవలేదు. ఆయనకు బాలికలు, యువతులంటే ఇష్టమని ఎప్‌స్టీన్‌ ఓసారి నాతో అన్నాడు’’ అని సోబెర్గ్‌ వాంగ్మూలం ఇచ్చినట్లు ఆ పత్రాల్లో ఉంది. ఈ కేసులో బిల్‌క్లింటన్‌ పేరు దాదాపు 50 సార్లు వచ్చినట్లు తెలుస్తోంది.

ఏంటీ కేసు..
గొలుసుకట్టు పథకాన్ని పోలినట్లు ఎప్‌స్టీన్‌ పాల్పడిన సెక్స్‌ కుంభకోణం అగ్రరాజ్యాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. పేద, మధ్య తరగతి బాలికలు, యువతులకు భారీ మొత్తం ఆశగా చూపించి పామ్‌ బీచ్‌ బంగ్లాకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడు. బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి.. మరో యువతిని ఆ బంగ్లాకు తెస్తే ఇంకొంత మొత్తం కమిషన్‌ ఇస్తానని ఆశచూపేవాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం 2005లో బట్టబయలైంది. అప్పుడు అతన్ని అరెస్టు చేసి కొన్ని నెలలు పాటు జైల్లో ఉంచారు. 2019లో మీటూ ఉద్యమం సమయంలో మరోసారి ఎప్‌స్టీన్‌పై ఆరోపణలు రాగా.. అతడిని అరెస్టు చేశారు. అదే ఏడాది ఆగస్టులో అతడు జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z

TANA 2023 Elections Tagore Mallineni

TANA 2023 Elections Ravi Kiran Muvva

TANA 2023 Elections Sirisha Tunuguntla

TANA 2023 Elections Sunil Pantra

TANA 2023 Elections Ashok Babu Kolla

TANA 2023 Elections Raja Surapaneni