NRI-NRT

కెనడాలో భారతీయ కమ్యూనిటీ సభ్యులకు దోపిడీ కాల్స్ కలకలం

కెనడాలో భారతీయ కమ్యూనిటీ సభ్యులకు దోపిడీ కాల్స్ కలకలం

కెనడా(Canada)లోని భారత జాతీయులకు(Indians) కొన్ని వారాలుగా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేస్తూ దుండగులు ఈ కాల్స్‌ చేయడంపై భారత్‌ స్పందించింది. ఇది ఆందోళనకర అంశమని పేర్కొంది.

‘కెనడాలోని పౌరులు.. మరీ ముఖ్యంగా భారత జాతీయులకు దోపిడీ కాల్స్(Extortion Calls) రావడం ఆందోళన కలిగించే అంశం. భారత్‌-కెనడా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇదివరకు ఒక ఆలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై కెనడా పోలీసులు విచారణ జరిపి, మతిస్థిమితం లేని వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటన విడుదల చేశారు. కానీ ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్ అన్నారు.

ఈ దోపిడీ కాల్స్‌ కథనాల వేళ అక్కడి అధికారులు విచారణ నిమిత్తం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇండో-కెనడియన్ కమ్యూనిటీ నిర్వహిస్తోన్న వ్యాపార సంస్థలకు ఈ కాల్స్ వస్తున్నట్లు సమాచారం. ఈ తరహా తొమ్మిది ఘటనలపై దర్యాప్తు జరుగుతోంది.

గత ఏడాది జూన్‌లో కెనడాలోని సర్రే ప్రాంతంలో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం రాజుకుంది. ట్రూడో వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలను సమర్థించే ఆధారాలు ఇవ్వాలని.. వాటిని పరిశీలించిన తర్వాతే ఈ కేసుపై తదుపరి చర్యలు తీసుకుంటామని భారత్‌ ఇప్పటికే పలుమార్లు కెనడాకు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. నిజ్జర్‌ హత్య కేసులో ఇద్దరు అనుమానితులను కెనడా పోలీసులు (Canada Police) అతి త్వరలోనే అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

TANA 2023 Elections Sunil Pantra

TANA 2023 Elections Ashok Babu Kolla

TANA 2023 Elections Ravi Kiran Muvva

TANA 2023 Elections Raja Surapaneni

TANA 2023 Elections Sirisha Tunuguntla

TANA 2023 Elections Tagore Mallineni

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z