Business

ఇండిగో విమాన టిక్కెట్ ధరలు తగ్గాయా?

ఇండిగో విమాన టిక్కెట్ ధరలు తగ్గాయా?

టికెట్లపై ప్రత్యేకంగా వసూలు చేస్తున్న ‘ఇంధన ఛార్జీ’ని తొలగిస్తున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) ప్రకటించింది. ఇంధన ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో మూడు నెలల క్రితం దీనిని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తొలగింపు నిర్ణయం నేటి నుంచే అమల్లోకి వచ్చిందని వెల్లడించింది.

విమాన ఇంధన ధరలు (ATF prices) ఇటీవల దిగొచ్చిన నేపథ్యంలోనే ప్రత్యేక ఛార్జీని తొలగించాలని నిర్ణయించినట్లు ఇండిగో (IndiGo) తెలిపింది. అయితే, ఏటీఎఫ్‌ ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉన్న నేపథ్యంలో టికెట్ల ధరలనూ అందుకనుగుణంగా సవరిస్తామని స్పష్టం చేసింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఇంధనానిదే సింహభాగం.

విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరను ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ సంస్థలు జనవరిలో 3.9 శాతం తగ్గించాయి. ధర తగ్గింపు వరుసగా ఇది మూడోసారి. ఇప్పటి వరకు దిల్లీలో కిలోలీటరు ధర రూ.1,06,155.67 కాగా, రూ.4162.50 తగ్గించడంతో రూ.101,993.17కు చేరింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z