రైతు భరోసా కి కావాల్సిన డేటా ప్రభుత్వం దగ్గర ఉంది.. మళ్ళీ దరకాస్తు కోసం ఎందుకు తిరగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. అభయ హస్తం పేరుతో ప్రజల్లో గందర గోళం నెలకొందన్నారు. ఆ ఫారం నింపడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని, ఇదంతా కాలయాపన కోసమే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో రాజకీయం తప్ప చిత్తశుద్ది లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్మ్స్ బ్లాక్ లో కొనుక్కోవాల్సి వస్తుందన్నారు. దరఖాస్తు అవసరం లేకుండానే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. రేషన్ కార్డ్ గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి ఇవ్వలేదు… లేదని తెలిసిన రేషన్ కార్డ్ జత చేయమనడం ఎందుకు? అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేసులు ఎవరి మీద నమోదు అయ్యాయో ప్రభుత్వం దగ్గర డేటా ఉందని గుర్తు చేశారు. 2,500 రూపాయలు ఎవరికి ఇస్తారు? Bpl ఫ్యామిలీ కి ఇస్తారా? డేటా ఉంది కదా? అని ప్రశ్నించారు.
రైతు భరోసాకి కావాల్సిన డేటా ప్రభుత్వం దగ్గర ఉందని తెలిపారు. మళ్ళీ ధరకాస్తు కోసం ఎందుకు తిరగాలని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం కార్డ్ ఎవరి దగ్గర ఉందో డేటా ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రజలను తిప్పుకోవడానికి, వారిని ఇబ్బంది పెట్టడానికి తప్ప మరొకటి కాదన్నారు. మోడీ మెడిసిన్ ఎక్స్పైరీ అయిందట..రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. ఆయన ఎప్పుడు వేసుకున్నారో..మీ రాహుల్ గాంధీ ఉన్నని రోజులు రిజెక్ట్ కాదు.. మోడీ మెడిసిన్ ప్రపంచానికే సంజీవని అన్నారు. రాహుల్ గాంధీ మెడిసిన్ రిజెక్ట్ అయిందన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయిందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవలేదు… బీఆర్ఎస్ ఓడి పోయిందన్నారు. కాళేశ్వరం విషయంలో అందరూ బాధను వ్యక్తం చేశారన్నారు. న్యాయ విచారణతో పాటు సీబీఐ విచారణ చేయించాలని కోరానని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని తెలిపారు. ఈ సీఎం గా ఉన్న వ్యక్తి ఎంపి గా ఉన్నప్పుడు ఆధారాలు అన్ని నా దగర ఉన్నాయి సీబీఐ కి ఉత్తరం రాస్తున్న అని చెప్పారు… రాశాడో లేదో తెలియదన్నారు.
ఎంపి నో, మంత్రి నో అడిగితే సీబీఐ విచారణ చేయలేదన్నారు. గతంలో సీబీఐ రాకుండా అప్పటి ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఇప్పుడు సీబీఐ విచారణ కు ఆదేశించే అవకాశం ఈ ప్రభుత్వానికి వచ్చిందని తెలిపారు. అసలు విషయం పక్కన పెట్టి నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు చేయాల్సిన బాధ్యత సీబీఐ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుందన్నారు. ఎంపి గా ఉనప్పుడు CBI విచారణకు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వాళ్ళకి నెల రోజుల్లోనే అహంకారం తలకెక్కిందని మండపిడ్డారు. Judicial ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేసి కేసీఆర్ ను కాపాడలనుకుంటూ చేసేదేమీ లేదని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ తో ఎప్పుడు కలవలేదని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ అంటకాగింది.. కలిసి అధికారం పంచుకుందన్నారు. నా ప్రస్థానం ఎలా మొదలు అయిందో సీఎం ప్రస్థానం ఎలా మొదలు అయిందో.. ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. అయన ఆదాయం ఏంటో నా ఆదాయం ఏంటో విచారణకు సిద్దమన్నారు. కాళేశ్వరంలో కమిషన్ తీసుకుంటే విచారణ చేయించు అని సవాల్ విసిరారు. లంకె బిందెలు ఉన్నాయని వస్తె ఇక్కడ చిప్ప ఉందని సీఎం అంటున్నారు… లంకె బిందల కోసం వచ్చావా? ప్రధాని నీ పట్టుకొని గజ దొంగ అంటావా? 12 లక్షల కోట్ల కుంభకోణం చేసింది సోనియా గాంధీ నాయకత్వంలో నీ ప్రభుత్వము కాదా? అని ప్రశ్నించారు.
నరేంద్ర మోడీ గజ దొంగల పాలిట యముడు అన్నారు. కుటుంబ పార్టీలకి, అవినీతి పార్టీలకి వ్యతిరేకంగా.. ఫార్మా సిటీ ఎత్తెస్తమని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఫార్మా సిటీ ఉంటుందని చెప్పారు. అందులో మతలబు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. 15 రోజుల్లో ఎందుకు యూ టర్న్ తీసుకుందో చెప్పాలని, ఫార్మా కంపెనీల లాబియింగ్ లొంగిపోయారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ గజ దొంగల పాలిట యముల్లం అన్నారు. సీఎం కుటుంబంతో బిజినెస్ భాగస్వామ్యం ఉన్నది ఎవరికో అందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ చేసేదేమీ లేదు… వాళ్ళు సాధించేది ఏమీ లేదు… నామ రూపల్లేక పోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తను కేసీఆర్ కి బినామీ కాదు.. వాళ్లే బినామీ లు అంటూ మండిపడ్డారు. అయోధ్య రామ మందిరం హిందువుల అచంచల విశ్వాసానికి ప్రతీక…మన జాతికి చిహ్నం అని తెలిపారు. దేశం మీద దాడి చేసి మన సంస్కృతి , ఆచారాలను దెబ్బ తీసిన విదేశీయులకి వ్యతిరేకంగా, బానిస మనస్తత్వం నుండి బయట పడడానికి ప్రతీక రామ మందిరం అన్నారు. ఈ నెల 14 నుండి 22 వరకు పుణ్య క్షేత్రాలు, ప్రార్థన మందిరాలలో స్వచత అభియాన్ బీజేపీ చేపడుతుందన్నారు. ఈ నెల 22 న రామాలయ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అందరూ ఇల్లు అలంకరించుకోవడం… సాయంత్రం 5 దీపాలను వెలిగించాలన్నారు.
👉 – Please join our whatsapp channel here –