కళాశాలలో తమకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో (JNTUH) పీజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో తాము తినే ఆహారంలో తరచుగా పురుగులు వస్తున్నాయని ఆరోపించారు. నాణ్యమైన ఆహారాన్ని అందించాలని తాము విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోయారు.
👉 – Please join our whatsapp channel here –