తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో వారిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను గురువారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
* జనవరి 11న నోటిఫికేషన్
* నామినేషన్ల దాఖలుకు చివరితేదీ జనవరి 18
* నామినేషన్ల పరిశీలన జనవరి 19
* నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ జనవరి 22
* ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్, కౌంటింగ్ జనవరి 29
👉 – Please join our whatsapp channel here –