సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా తాము ప్రతిపక్షంగానే చూస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) అన్నారు. చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందించారు. ‘‘షర్మిల కాంగ్రెస్‌లోకి వెళ్లినంత మాత్రాన మేం పార్టీ మారి మా కాళ్లు మేమే నరుక్కుంటామా?’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
జగన్‌పై వైకాపాకు చెందిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్ బాబు విమర్శలు చేయడాన్ని పెద్దిరెడ్డి ఖండించారు. జడ్పీటీసీగా గెలవలేని వ్యక్తిని ఎమ్మెల్యే చేశామన్నది గుర్తించాలన్నారు. పూతలపట్టులో పార్టీ ఇన్‌ఛార్జిని మార్చాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై విమర్శలు చేయడం ఎం.ఎస్ బాబుకు తగదన్నారు. ఇప్పటికైనా ఆత్మ విమర్శ చేసుకొని వైకాపా కోసం పనిచేస్తే బాగుంటుందని ఎం.ఎస్.బాబును ఉద్దేశించి అన్నారు.
👉 – Please join our whatsapp channel here –