‘ఒక రొమాంటిక్ సినిమాలో మనమే హీరో హీరోయిన్లమని అనుకున్నాను కానీ, విలన్లా మారతామని అనుకోలేదు స్వాతి’ అంటూ ‘కిల్లర్ సూప్’ రుచిని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమవుతున్నారు ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పేయీ. ఆయన..కొంకణా సెన్శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సిరీస్ ఇది. అభిషేక్ దౌబే తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు మనోజ్. ‘ఉమేష్, స్వాతి ఈ ఏడాదిలో అత్యంత విచిత్రమైన క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌తో మీ ముందుకు వస్తున్నారు. ఎన్నో రహస్యాలతో ‘కిల్లర్ సూప్’ని రెడీ చేస్తున్నారు’ అంటూ వ్యాఖ్యల్ని జోడించారు. ఉరికే చిలకా..వేచి ఉంటాను కడవరకు…అంటూ సాగే నేఫథ్య గీతంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం వినోదాన్ని పంచుతూ ఆసక్తిగా సాగింది. ఉమేష్ పాత్రలో మనోజ్ భిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తూ నవ్వులు పంచారు. నాజర్, సాయాజీ శిందే కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్ ఈ నెల 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
👉 – Please join our whatsapp channel here –